ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేయండి

 ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేయండి
– స్వార్థ రాజకీయాలు మానుకోండి
– వరంగల్ తూర్పు లో అభివృద్ధి శూన్యం
-ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే అభివృద్ధి
-ఎమ్మెల్యే భాష తీరు ఓరుగల్లు పరువు తీసేలా ఉంది
– ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న టిఆర్ఎస్
– విలేకరుల సమావేశంలో బీజీపీ నేత గంట రవికుమార్ ధ్వజం
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 12(జనం సాక్షి):
ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఒరగ బెట్టింది ఏమి లేదని.. ప్రజా సమస్యలను గాలికి వదిలిన ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి నేత గంట రవికుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం శివ నగర్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు
 ప్రగతి విజన్ అంటూ లేని, నియోజకవర్గ సమస్యల్ని తీర్చడంలో పూర్తిగా విఫల మైనందున ఎమ్మెల్యేకు ఆ పదవిలో ఉండే అర్హత  లేదన్నారు. చేతగాని ఎమ్మెల్యే అని సొంత పార్టీ నేతలే చెబుతుండటంతో ఆయన పనితీరుకు నిదర్శనం అని రవి కుమార్ అన్నారు
ఈగడ్డపై ప్రేమ, అభివృద్ధిపై చిత్త శుద్ది ఉంటే నరేందర్ తన రాజీనామా చేయాలి. అప్పుడే ఉప ఎన్నిక వస్తుందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు పుట్టిందని.. మునుగోడు ఉప ఎన్నిక తో 10 లక్షల పెన్షన్లు పుట్టాయని …తూర్పు తో బిసి బంధు లాంటివి పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే ఎన్నిక వస్తేనే ఈ చేతగాని ప్రభుత్వం స్పందిస్తుందని ద్వజమెత్తారు. ఓటర్లతో పని ఉంటేనే ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పనిచేస్తారని ఎద్దేవా చేశారు. ఇది ఓట్ల కోసం పనిచేసి ప్రభుత్వమని మండిపడ్డారు.
 ఎమ్మెల్యే హోదాలో ఉండి నరేందర్ ఓరుగల్లు పరువు తీసేలా దుర్భాషలాడుతూ మాట్లాడ్డం నీచంగా ఉందన్నారు. రజాకార్ల ను ఎదిరించి.. దేశం కోసం జాతీయ పతాకాన్ని చేతబూని న స్ఫూర్తి ప్రదాత మోగిలయ్య పుట్టిన గడ్డపై ఎలాంటి భాష వాడడం సిగ్గుచేట న్నారు.
అంబేడ్కర్ రచించిన ప్రపంచం లోనే అతిపెద్దది అయిన రాజ్యాంగంలో వ్యక్తిగత దూషణలకు తావు లేదన్నారు. ఎమ్మెల్యే వాడుతున్న భాషపై ముఖ్యంగా యువత మండి పడుతోందన్నారు. రాజకీయాల్లోకి రావాలనే యువతకు ఇలాంటి భాష  వెగటు పుట్టిస్తోంది అని అన్నారు.
ఉప ఎన్నిక వస్తే వరంగల్ బస్టాండ్, ఎంజిఎం, 23 అంతస్థుల సూపర్ స్పషాలిటీ ఆస్పత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ, శిల్పారామం, కలెక్టరేట్, ప్రభుత్వ శాఖల తరలింపు వంటివి సాకారం అవుతాయన్నారు. విద్య, వైద్యం, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
తన సొంత గడ్డ అయినా శివనగర్ ప్రాంతం బురద మయంగా మారినా కనీసం పట్టని ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంత వాసుల దురదృష్ట మన్నారు.ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యక్తి గతంగా  కాకుండా ప్రజా సేవకు పాటుడాలని సూచించారు. తనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ రాలేదని టీఆరెఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు కానీ, ఎమ్మెల్యే అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడా ఎండగట్ట లేదన్నారు. ప్రజా సేవకు పదవి అక్కరలేదని అన్నారు. సేవ చేసేవారిని ప్రజలే గెలిపించు కుంటారని, ఇక్కడి ఓటర్లకు ఆ చైతన్యం ఎక్కువే అన్నారు. ఒకవేళ  బిజేపి సిద్దాంతాలు నచ్చి పార్టీలోకి వస్తె ఆహ్వానిస్తామని అన్నారు. వ్యక్తి గత సిద్ధాంతాలకు బిజెపి దూరం అన్నారు.పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా బిజేపి నుంచి తూర్పు బరిలో ఉంటానని అన్నారు. ఒకవేళ వేరే వారికి అవకాశం ఇచ్చినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తా నన్నారు. అంతేగానీ ఇలా రచ్చ కెక్కనని అన్నారు.నియోజకవర్గం అభివృద్ధి కోసం కాకుండా స్వార్థ రాజకీయం, పదవుల కోసం .. టీఆరెఎస్ నాయకులు ప్రపంచ కీర్తి చాటిన కాకతీయుల పరువు తెస్తున్నా రాన్నారు. ప్రజల కోసం నిస్వార్ధంగా పని చేసేవారిని ఈ గడ్డ ఎల్లపుడూ అక్కున చేర్చుకుం దని, ఇక్కడి ఓటర్లు చైతన్య వంతులని రవికుమార్ అన్నారు. ఇలా చిల్లర రాజకీయాలు చేసే నాయకులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు.