ప్రజల గొంతు వినిపించాలంటే కాంగ్రెస్ గెలవలి
నగరంలో అభివృద్ది ఘనత గత ప్రభుత్వాలదే
టిఆర్‌ఎస్ హయాంలో రెండేరెండు పనులు జరిగాయి
సచివాలయ కూల్చివేత..ప్రగతిభవన్ నిర్మాణం
కెటిఆర్ మంత్రి అయ్యాక చెరువులన్నీ కబ్జా
గండిపేటను ఎండబెట్టేందుకు 111 జీవోకు తూట్లు
టిఆర్‌ఎస్ హయాంలో వ్యవస్థీకృత నేరాలు బాగా పెరిగాయి
విూట్‌ది ప్రెస్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్,నవంబర్23 (జనంసాక్షి):
ప్రజల గొంతు వినిపించాలంటే టిఆర్‌ఎస్ ఓడిపోవాలని, విపక్షాలు గెలవాని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆరేండ్లలో కేసీఆర్ చేసిన పనుల్లో ఒకటి ప్రగతి భవన్‌కట్టుకోవడం, రెండు సెక్రటేరియట్‌ను కూల్చివేయడమన్నారు. తెలంగాణ రావడానికి ముందు తరువాత చేసింది ఏమి లేదన్నారు. కేసీఆర్,కేటీఆర్ భ్రమలు కల్పించారు తప్ప అభివృద్ధి చేసింది ఏమి లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విూట్‌ద ప్రెస్‌లో మాట్లాడుతూ ప్రజలు గొంతెత్తి ప్రశ్నించే అవకాశం ప్రజలు ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌కు రింగ్ రోడ్డు, మెట్రో రైలు,ఫ్లై ఓవర్‌లు కాంగ్రెస్, టీడీపీలు కట్టినవేనన్నారు. అప్పుడు మిగిలిన వాటిని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారన్నారు. అన్ని చేస్తే టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ వెబ్ సైట్‌లో నుండి ఎందుకు డిలీట్ చేశారన్నారు. ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఫ్లై ఓవర్‌లు నిర్మించారని అన్నారు. మెట్రో రైలు కట్టింది 67 కిలోవిూటర్లేనన్నారు. గౌలిగూడ, ఫలక్‌నామ ప్యాలెస్‌కు పూర్తిగా నిర్మిస్తేనే ఆ ప్రాజెక్టు72 కి.విూ పూర్తి అయినట్టన్నారు. భూ సేకరణ జరగలేదని ఆ ప్రాజెక్టు కట్టడం లేదన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ ను నాశనం చేస్తే..తెలంగాణను కేసీఆర్ దోపిడీ, విధ్వంసం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టూ 4 హాస్పిటల్‌లు కడుతామని చెప్పి 4 ఏండ్లు అవుతున్నా ఇప్పటికి ఒక్కటి కూడా కట్టలేదన్నారు. పీజేఆర్ పోరాటం వల్ల కృష్ణ నది జలాలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. గోదావరి నది జలాలు కిరణ్ కుమార్ రెడ్డికి తీసుకువస్తే కేటీఆర్ గోదావరి నీళ్ళు నెత్తి విూద చల్లుకున్నాడన్నారు. గండిపేటను ఎండబెట్టేందుకు 111జీవోకు తూట్లు పొడుస్తున్నారి, గండిపేట పరివాహక ప్రాంతాలను కబ్జా చేశారని ఆరోపించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఆర్గనైజ్డ్ కైంకు పాల్పడుతుందన్నరు. మెట్రో, స్యాండ్ ,ల్యండ్,మైన్స్ అన్నీ టీఆర్‌ఎస్ పెద్దల చేతుల్లోకి వెళ్లాయన్నారు. పేకాట స్థావరాలను మూసేసి.. ప్రభుత్వ పెద్దలు పేకాటను ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్ చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను మహా నగరంగా తీర్చిదిద్దింది నిజాం నవాబులేనన్నారు. నాలుగువేల చెరువులను గుర్తించ లేక్ సిటీగా గుర్తింపునిచ్చారన్నారు. విద్యా , వైద్యం,ఆరోగ్యం రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. 100 సంవత్సరాల్లో ఎంత ఆక్రమణకు గురైందో,ఈ ఐదేళ్లలో మూసీనది, గండిపేట చెరువు,పార్కులు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. హైదరాబాద్‌లో వచ్చిన వరదలు ప్రకృతి వైపరిత్యం కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన వరదలన్నారు. 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడటానికి ప్రభుత్వమే కారణమన్నారు. తప్పుడు ప్రచారాలతో అబద్దపు పుస్తకాలు ప్రచురించి లబ్దిపొందాలని చూస్తున్నారన్నారు. హైదరాబాద్ నిర్మాణాలకు ప్రభుత్వం ఖర్చుపెట్టింది అక్షరాల కేవలం రూ. 6 వేల కోట్లన్నారు. ఇందులో రూ.2400 కోట్లు అప్పుతెచ్చారన్నారు. వందలమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. కొన్ని వందల ఏళ్ల క్రితమే నిజాం పాలకులు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన సాగుతోంది. తెరాస వల్లే మెట్రో వ్యయం పెరిగింది. ఎంఐఎం కోసం గౌలిగూడ వరకు మెట్రో నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో మెట్రోకు రూ.3500 కోట్ల నష్టం. మాయ మాటలతో కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. రూ.67వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్దం. నగరానికి ఖర్చు పెట్టింది రూ.6వేల కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను తమ ఖర్చుల్లో కలిపి చూపిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి. వరద బీభత్సం ప్రకృతి వైపరీత్యం కాదన్నారు. వందలాది మంది బలిదానాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌కు అది తెస్తున్నాం.. ఇది తెస్తున్నామంటున్నాయని, నిజాం కట్టడాలు, పెట్టుబడుల ద్వారా హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ ప్రజలకు టీఆర్‌ఎస్ చేసిందేవిూ లేదని, చెరువులు, పార్కులను టీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే హైదరాబాద్‌ను వరదలు ముంచాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. మంత్రి కేటీఆర్ అనుచరులు వందల చెరువులను ఆక్రమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత నాలాల కబ్జాలు పెరిగిపోయాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ప్రపచంలో అత్యధిక అబద్దాలున్న పుస్తకం.. టీఆర్‌ఎస్ ప్రగతి నివేదికని, అబద్దాలను ప్రచారం చేస్తూ.. ఎన్నికల్లో గెలవాలని టీఆర్‌ఎస్ చూస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో 2014కు ముందే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తిచేశామన్నారు. కేసీఆర్ సన్నిహితుల కోసం హైదరాబాద్‌లో నాలుగు రోడ్లు వేశారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల హైదరాబాద్ మెట్రోకు రూ.3,500 కోట్ల అదనపు భారం పడిందన్నారు. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోను వేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కరోనా కాలంలో సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రూ.4వేల కోట్లు వచ్చాయని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌కు వచ్చిన విరాళాలను టీఆర్‌ఎస్ నేతలు కాజేశారని విమర్శించారు. వందేళ్లలో జరగని ఆక్రమణలు కేసీఆర్ వచ్చిన అరేళ్లలో జరిగాయన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీలు చెరువుల్లోనే ఉన్నాయన్నారు. ఓ మంత్రిగారి వియ్యంకుడి చేతిలో మొత్తం గుట్కా బిజినెస్ నడుస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్‌ను కొన్ని వేలకోట్లు పెట్టి ఖర్చుపెట్టామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, పీవీ ఫ్లైఓల్గ/వర్ బ్రిడ్జి, మెట్రో రైలు, ఫ్లైఓల్గ/వర్లు, గోదావరి, కృష్ణాజలాలు.. ఇవన్నీ గత ప్రభుత్వాలు టీడీపీ, కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనన్నారు. ఎక్కడైనా ప్రారంభోత్స వాలు పెండింగ్ ఉంటే.. వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేసి గొప్పలు చెబుతోందని విమర్శించారు. నిజాయితీ గా ఒక్క నిజం అయినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెబుతారేమోనని.. చూశారని, అలాంటి పరిస్థితి కనిపించలేదని రేవంత్ రెడ్డి అన్నారు.