ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం

జహీరాబాద్ , సెప్టెంబర్ 9 ,(జనం సాక్షి)
ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని జహీరాబాద్ నియోజకవర్గం,కోహిర్ మండలంలోనీ తోరామామిడి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ స్ఫూర్తి మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డిపో మేనేజర్ రజిని కృష్ణ మాట్లాడుతూ ఆర్టిసి ప్రజలకు,విద్యార్థులకు ప్రయాణాలలో రాయితీలు ద్వారా అనేక ప్రయోజనాలు కల్పిస్తున్మదని ,స్కూల్ విద్యార్థులకు ఫ్రీబస్ పాసులు, ప్రజలకు నెలవారి సీజన్ పాసులు అందిస్తూ ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నదని, ప్రస్తుతo పెరిగిన ఆయిల్ రేట్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని వ్యయ భారం తగ్గించుకొని సర్వీస్లు పెంచాలంటే ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలు ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం చేయడం సురక్షితం కాదని ,ఆర్టీసీ బస్సులో శిక్షణ పొందిన డ్రైవర్లు బస్సులు నడపడం వలన క్షేమంగా గమ్యాస్తానాలు చేరుతారని డిపో మేనేజర్ గుర్తు చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రజలకు సర్వీస్ లు పెంచాలంటే సర్వీస్ చార్టు ఖచ్చితముగా అమలయ్యేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శ్రీనివాస్ ఆర్టీసీ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.