ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే భూదానం…
– ఆస్పత్రి నిర్మాణం కోసం మరో ఎకర పొలం ఇస్తా.
– కబడ్డీ మరియు కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 5 (జనం సాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ఊరుకొండ మండల అభివృద్ధిలో భాగంగా ప్రజల సౌకర్యం కోసం పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 30 గుంటల భూమిని భూదానం చేశానని
కబడ్డీ మరియు కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తెలిపారు. ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల 410 సర్వే నెంబర్ లో పోలీస్ స్టేషన్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి కూడా మరో ఒక ఎకరం భూమిని భూదానం చేస్తానని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అట్టి పత్రాలు అడిషనల్ ఎస్పి రామేశ్వర్ కు అందజేశారు. అనంతరం తాను పోలీస్ స్టేషన్ కు వితరణ చేసిన భూమిని అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తో పాటు సిఐ సైదులు, ఎస్సై కావలి రాజు తో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ కు, ఆస్పత్రి నిర్మాణానికి ఇచ్చిన ఎకరా 30 గుంటల భూమి యొక్క మొత్తం విలువ సుమారు 3 కోట్లు ఉండడంతో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సిఐ సైదులు, ఎస్సై కావలి రాజు, స్థానిక సర్పంచ్ రాజయ్య, మధుసూదన్ రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
5యుకె01, ఊరుకొండ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను అడిషనల్ డీఎస్పీ రామేశ్వర్ కు అందజేస్తున్న స్థలదాత ముచ్చర్ల జనార్దన్ రెడ్డి.
5యుకె02, ఊరుకొండ పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని పరిశీలిస్తున్న అడిషనల్ డిఎస్పి, పోలీస్ సిబ్బంది తదితరులు.