*ప్రజల సంఖ్యను బట్టి చెత్త జనరేట్ చేయాలి.*


_దోమ సర్పంచ్ కె.రాజిరెడ్డి._

*దోమ  న్యూస్ జనం సాక్షి.

.గ్రామ ప్రజల సంఖ్యకు అనుగుణంగా చెత్త జెనరేట్ అయ్యేలా ద్రుష్టి పెట్టాలని దోమ సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె. రాజిరెడ్డి అన్నారు.బుధవారం దోమ గ్రామపంచాయతీ పరిధిలోని  ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను కొన్ని ఇళ్ల దగ్గరకు వెళ్లి తడి,పొడి చెత్తను తూకం చేసారు.తడి,పొడి చెత్త సేకరణలో భాగంగా దోమ పంచాయతీ పైలెట్ ప్రాజెక్టు గా ఉన్నందున ఇళ్ల నుంచి సేకరించే చెత్త తూకం చేసే ప్రోగ్రామ్ లో భాగంగా పైలెట్ ప్రాజెక్టు సిబ్బంది శివప్రసాద్ పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తొ కలిసి సర్పంచ్ రాజిరెడ్డి హోటల్స్ మరియు కొన్ని ఇళ్లకు తిరిగి తడి,పొడి చెత్త సేకరణ విషయం అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ విషయంలో ఇంకా పది పదిహేను శాతం ఇళ్ల వారు ట్రాక్టర్ కు చెత్త ఇవ్వడం లేదని సిబ్బంది తెలుపడంతొ చెత్త ఇవ్వని ఇళ్లను గర్తించి నోట్ చేసుకోవాలని వారి ఇళ్లకు వెళ్లి చెపుదామని సర్పంచ్ రాజిరెడ్డి సూచనలు ఇచ్చారు.పరిశుద్యం పట్ల ప్రజలకు వివరించాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎం లను పిలిచి గ్రామంలో చెత్త ఇవ్వని వాళ్ళ ఇళ్లకు తిరిగి చెత్త ఇచ్చే విదంగా చూడాలని సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి సూచించారు.*