ప్రజల సమస్యలపై ఉద్యమిస్తాం.
వైయస్సార్ టి పి జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 14. (జనం సాక్షి). వైయస్సార్ టి పి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని జిల్లా అధ్యక్షులు చోక్కాల రాము అన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ టి పి, నాయకురాలు షర్మిల చేస్తున్న పాదయాత్ర రెండు వేల అయిదు వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చొక్కాలు రాము మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని అన్నారు. ఆయన ఆశయ సాధనలోననే వైయస్సార్ టిపి, నడుస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కు ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆదరణ కొనసాగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాజీవ్ నగర్, శాంతి నగర్ ల నుండి పలువురు వైయస్సార్ టిపి,లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలోనాయకులు రాజా రమేష్, కారంపూడి రవి, సాయి కృష్ణ, వంగరి అనిల్ మ్యాన లక్ష్మీనారాయణ ,ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.