ప్రజాపాలనకే పల్లెల ఓటు
`కాంగ్రెస్ పాలనకు గ్రామీణ ప్రజలు పట్టం కడుతున్నారు
` భారీగా నమోదవుతున్న ఓటింగే అందుకు నిదర్శనం
` ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీ ఎన్నికలు:మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్(జనంసాక్షి): స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు నిర్వహించిన రెండు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని రాష్ట్ర పౌర సరఫరాల, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ లో ప్రజలను కలిసి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం కాబట్టే సానుకూల స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. ప్రజలందరూ గమనించాలి. గతంలో మాదిరిగా కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడలేదు. పారదర్శకంగా , స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం బెదిరింపులు కక్ష సాధింపు రాజకీయం చేసింది. బీఆర్‌ఎస్ కు కాంగ్రెస్ కు తేడా అంటే కాంగ్రెస్ హయాంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, సంక్షేమం ఒకవైపు చేస్తూ, రాష్ట్రాన్ని ఎవరు ఊహించని విధంగా నెక్స్ట్ డెవలప్మెంట్ కు తీసుకెళ్తున్నాం. అన్ని విధాలుగా ప్రణాళికలు జరుగుతున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే మీ గ్రామం బాగుపడిరది. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆలోచన చేసి ప్రజలు ఓటేయాలన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎవరు కనీ విని ఎరుగని రీతిలో లిఫ్టు ఇరిగేషన్లు కొత్తవి నిర్మాణం చేస్తున్నాం, పాతవి పూర్తిస్థాయిలో మరమత్తులు చేస్తున్నాం. అన్ని రిజర్వాయర్లు ప్రతి పంటకు పంటలు పండుతున్నాయి. ప్రతి ఎకరానికి నీళ్లు వస్తున్నాయి. ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లికార్జునరావు, గెల్లి రవి, గూడెపు శ్రీనివాస్, దొంత గాని శ్రీనివాస్ గౌడ్, కోలపూడి యోహాన్, కోడి ఉపేందర్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.


