ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి

నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్), ఆగస్టు 10 (జనం సాక్షి) :మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా
నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి పాల్గొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాలని అన్నారు. అధికారుల నివేదికలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువయ్యేలాగా కృషి చేయాలని కోరారు. మండలంలో నెలకొన్న పోడు భూముల సమస్యలు ,అటవీ భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ,నెల్లికల్ లిఫ్టు పనులు త్వరితగతంగా పూర్తయ్యేలా చూస్తానన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాల నిర్మాణం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సలహాలు,సూచనలు చేశాడు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఇస్లావత్ పాండు నాయక్, ఎంపీడీవో అస్గర్ అలీ,
మండల వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జయరాం నాయక్, ఎంపీటీసీలు,
వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు