ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దిబ్బెందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలి
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
మోమిన్ పేట ఆగస్టు 8 జనం సాక్షి
ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతున్న బి ఆర్ ఎస్ బిజెపి పార్టీలను గద్దె దింపేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీర సైనికులు వలె పని చేయాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం మండల పరిధిలోని వెల్చల్ గ్రామంలో బిజెపి బీఆర్ఎస్ నుంచి 150 మంది కార్యకర్తలు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన్నె శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 500 రూపాయలకు వంట గ్యాస్ ధరణి పోస్టల్ రద్దు సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ప్రతి ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఒక్కొక్కరికి 4000 చొప్పున నిరుద్యోగ భృతి రుణమాఫీ రెండు లక్షలు అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేసి వడ్డీ కిందనే జమ చేసుకుంటుందని ఆయన ఆరోపించారు దళిత ముఖ్యమంత్రి అని మాయ మాటలు చెప్పి దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రి చరిత్రహీనుడని అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సమాన హక్కులు కలగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తే ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని ఆయన కొనియాడారు ప్రజలు ఎవరు టిఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదని సభాముఖంగా పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో దేశంలో ప్రధాని రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య కోస్గి సురేందర్ జిల్లా కార్యదర్శి మానేయ్య యాదవ్ జిల్లా కార్యదర్శి సుభాష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్ మండల జనరల్ సెక్రెటరీ మహేందర్ చారి ఎజాజ్ పటేల్ కోఆప్షన్ సభ్యులు భోగ్దాద్ మాజీ ఉపసర్పంచ్ కావలి శ్రీనివాస్ నాయకులు మల్లేశం యాదవ్ పులుగు పెంటయ్య వేమారెడ్డి విజయకుమార్ గొల్ల శేఖర్ పాండు శ్రీశైలం రామకృష్ణారెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షులు అస్లాం వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు