ప్రజా సమస్యలను తెలుసుకున్న రేవంత్‌


మేడ్చల్‌,అగస్టు25(జనంసాక్షి): మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి రెండ్రోజుల దీక్ష కొనసాగుతోంది. దీక్షలో భాగంగా రెండో రోజు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో రేవంత్‌రెడ్డి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, మూడెకరాల భూమిపై ఆరా తీశారు. స్థానిక సమస్యలపై మల్కాజిగిరి కలెక్టర్‌తో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.