ప్రజా సమస్యలను ప్రజల మధ్యనే తేల్చుకుందాం.

బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బొంత సురేష్.

జనం సాక్షి, చెన్నరావు పేట

మండలంలోని అక్కల్ చెడ గ్రామపంచాయతీకి ఆర్టిఏ క్రింద పది అంశాలపై సమాచారం కోరిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బొంత సురేష్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని బొంత సురేష్ తెలిపారు.గత కొన్ని రోజులుగా ప్రజా సమస్యల కొరకై పోరాడుతున్న సంగతి తెలిసిందే అక్కల్ చెడ ప్రాంతానికి చెందిన కొంతమంది అక్కల్ చెడ గ్రామస్తులు బిజెపి మండల ప్రధాన కార్యదర్శి తో అక్కల్ చెడలో జరిగే సమస్యల కొరకై ప్రజలు గ్రామంలో జరిగే అవినీతి రహిత పనుల గురించి తెలియ జేయగా సురేష్ వారితో మాట్లాడి కుంభ కోణాల వివరాలను అన్వేషించి,శోధించి నేరుగా ప్రజల ముందుకు తెచ్చే సందర్భం ఒక రోజు వస్తుందన్నారు. సాక్షదారాలతో సహా ప్రజల ముందు, అధికారుల ముందు ఉంచే ప్రయత్నం కొరకు బి జె పి మండల ప్రధాన కార్యదర్శి బొంత సురేష్ సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించి, దరఖాస్తు 10 అంశాల పై సమాచారాన్ని అందించగలరని పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణకు కోరి స్వయంగా దరఖాస్తును అందించడం జరిగిందన్నారు.