ప్రజా సమస్యలు సకాలంలో పరిషరించాలి:: జిల్లా కలెక్టర్ జి.

 

జగిత్యాల  ,రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, ధరణి పెండింగ్ మ్యూటేషన్, అక్రమ ఇసుక రవాణా నియంత్రణ తదితర అంశాల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో గత వారంలో మండలాల వారీగా సీజ్ చేసిన అక్రమ ఇసుక రవాణా వివరాలు కలెక్టర్ తహసిల్దార్ లను అడిగి తెలుసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా క్షేత్రస్థాయిలో నిలిపివేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో నిఘా పెంచి ఫైన్లు అధిక మొత్తంలో విధించాలని కలెక్టర్ తెలియచేశారు.

మన ఊరు మన బడి పనులకు అవసరమైన ఇసుకను కేటాయించాలనే, దీనిపై సంపూర్ణ నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆర్డీవోలకు ఆదేశించారు.

కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న వాటిని, తాసిల్దారు సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని తోరగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం ధరణి దరఖాస్తులు, పెండింగ్ మ్యూటేషన్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం మండలాల వారీగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి నిర్మాణ పనులు జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆర్.డి.ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణశ్రీ, జగిత్యాల,కొరుట్ల, రెవెన్యూ డివిజన్ అధికార్లు, తాసిల్దారు సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.