ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవ వేడుకల నిర్వహించాలి

ప్రణాళికాబద్ధంగా వజ్రోత్సవ వేడుకల నిర్వహించాలి
– సీఎస్ సోమేశ్ కుమార్.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 9 (జనం సాక్షి);
ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన ప్రణాళిక బద్ధంగా వజ్రోత్సవాలు జరుపుకోవాలని సి ఎస్ సోమేష్ కుమార్ అన్నారు.
ప్రతి గ్రామంలో వన మహోత్సవం కింద మొక్కలు నాటాలనీ,ఫ్రీడం కప్ కింద గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీల నిర్వహణ,ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనీ, స్వతంత్ర వజ్రోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్.
జిల్లాల లో ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్ లను ఆదేశించారు. వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలో నిర్వహించే కార్యక్రమాలకు జిల్లా స్థాయి లో కలెక్టర్ లు పక్కా కార్యాచరణ సిద్దం చేసుకొవాలని సీఎస్ సూచించారు. ఆగస్టు 10న ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడం పార్క్ కింద కనీసం 75 మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఆగస్టు 11న ఉదయం 6.30 నుంచి 8.00 గంటల వరకు ప్రతి మండల కేంద్రంలో ఫ్రీడం రన్ నిర్వహించాలని ఆదేశించారు.
ఫ్రీడం రన్ నిర్వహణలో స్థానిక పోలీస్ అధికారులు చురుగ్గా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, ప్రభుత్వ సిబ్బంది భాగస్వామ్యం చేస్తూ పకడ్బందీగా ఫ్రీడం రన్ పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 12న జాతీయ సమైక్యత కోసం రక్షాబంధన్ నిర్వహణ, ఆగస్టు 13న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీ లో జాతీయ జెండా, ఫ్లకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహించాలని, అనంతరం బేలూన్ గాల్లోకి వదలలాలని తెలిపారు.
ఆగస్టు 14న ప్రతి నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని, 119 బృందాలు సిద్దం చేసి సన్నద్ధంగా ఉండాలని సీఎస్ తెలిపారు. ఆగస్టు 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని సీఎస్ పేర్కొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు, ప్రతి ముఖ్యమైన కూడలి, ట్రాఫిక్ జంక్షన్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రతి విద్యా సంస్థ , వాణిజ్య ప్రదేశాలలో, కార్యాలయాల్లో గీతాలపన జరగాలని సీఎస్ తెలిపారు. జాతీయ గీతాలాపన చేసే ప్రదేశాలలో నిశబ్దం పాటించాలని, అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామం పరిధిలో క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 11,12 న గ్రామ స్థాయిలో, ఆగస్టు 13,14న మండల స్థాయిలో, ఆగస్టు 16,17న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, ఆగస్టు 18న ఫ్రీడం కప్ చివరి పోటిలు నిర్వహించి విజేతలను నిర్ణయించాలని తెలిపారు.
ఆగస్టు 19న జిల్లాలో ఉన్న ప్రతి వృద్ధాశ్రమం,ఆసుపత్రి,అనాథ శరణాలయంలో స్వీట్స్ పండ్లు పంచాలని ,ఆగస్టు 20న రంగోలి పోటీలు, ఆగస్టు 21న గ్రామ పంచాయతీ, మండల, జడ్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.
ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారంతో నివేదికలు పంపాలని సిఎస్ ఆదేశించారు.
వజ్రోత్సవ వేడుకలో అధికంగా ప్రజలను సమీకరించి ఫ్రీడం రన్, ర్యాలీ, సామూహిక జాతీయ గీతాలపన,ఫ్రీడమ్ కప్ నిర్వహణలో పోలీసులు ముఖ్య పాత్ర పోషించి విజయవంతం చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష , జిల్లా అడిషి న ల్ ఎస్ పి రాములు నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చందు నాయక్, ఇంచార్జీ డి ఆర్ డి ఓ నాగేంద్రం
డి పి ఓ శ్యామ్ సుందర్,
డి పి ఆర్ఓ చెన్నమ్మ, రమేష్ బాబు,ముసయిదా బేగం, పురు షోత్తం రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.