ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది
పారిశద్ధ్యం, పచ్చదనానికి ప్రత్యేక శ్రద్ద
పాలనా సంస్కరణలతో అభివృద్దికి బాటలు

హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి): తెలంగాణలో చేపట్టిన పల్లెపట్టణ ప్రగతి కార్యక్రమాలతో మంచి
ఫలితాలు కానవస్తున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపిలు అంతా కలసి పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, హరితహారం కింద మొక్కలు నాటడం జరిగింది. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాల్లో మార్పులకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిరది. పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివెరిసేలా కార్యక్రమాలు సాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడమే తమ ప్రాధాన్యమని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. అదే మనకు అత్యంత ముఖ్యమైన పని అన్నారు. ఒక టీమ్‌లాగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నదే సిఎం కెసిఆర్‌ ఆకాంక్షగా ఉంది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ జరిగింది. అలాగే పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాకుండా ప్రతి నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నారు. అలాగే చెత్త నిర్వహణకు ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించారు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని ఆదేశించారు. విరివిగా మొక్కలు పెంచడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలని, మురికి గుంటలు, చెత్తా చెదారం తొలగించాలన్నారు. అభివృద్దిని అనుకున్న కోణంతో ముందుకు తీసుకుని వెళ్లడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పాలనా సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు, గ్రామాలను,పట్టణాలను అభివృద్ది పట్టాలకు ఎక్కించేందుకు సిఎం కెసిఆర్‌ ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నారు. పల్లెలు,పట్టణాల అభివృద్ది పనులను ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే జిల్లా స్థాయిలో అభివృద్ది నమూనా ఒకేలా ఉండేలా దిశానిర్దేశం చేశారు. ఎవరికి వారు తమ సొంత మోడళ్లను ప్రవేశ పెట్టి ముందుకు పోకుండా తెలంగాణ బ్రాండ్‌ మేరకు ముందుకు సాగేలా సిఎం కెసిఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యతగా ఉండాలని ఆదేశించారు. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని గతంలోనే కలెక్టర్లకు స్పష్టీకరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు రూ.40వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం ఉండేది. అయితే చాలా తక్కువ సమయంలోనే ఆ సమస్యను అధిగమిం చారు. నేడు దేశంలో అన్నిరంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరంగా విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలబడిరది. మిషన్‌ భగీరథ పథకం వల్ల ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కార మవుతోంది. గతంలో వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా ప్రజలు మంచినీటికి అవస్థలు పడేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇకపోతే వ్యవసాయ
పరంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి ఏర్పడుతున్నది. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా సాగుతున్నాయి.