ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి..

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి):
బాధ్యతాయుతంగా ప్రతిఒక్కరు వివిధ రకాల మొక్కలు నాటి వాటిని సంరక్షణకు చర్యలు తీసుకోవాలని దేష్పాండే ఫౌండేషన్ ఫీల్డ్ స్టాపర్ ఇందల్ జాధవ్ అన్నారు.బుధవారం రోజున దేష్పాండే ఫౌండేసన్,బీసీఐ ఆధ్వర్యంలో  మండలంలోని గోండుగుడా గ్రామంలో బీసీఐ రైతులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్బంగా వారు రైతులతో మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు ప్రకృతి పర్యావరణానికి పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపడాలని,వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాని ప్రతిఒక్కరు బాధ్యతగా తప్పకుండ పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో దేష్పాండే ఫౌండేషన్ పిల్డ్ స్టాప్ ఇందల్ జాధవ్ తోపాటు గ్రామ ఉప సర్పంచ్ పెందూర్ భీంరావు లీడ్ ఫార్మర్ సీడం సంతోష్ అంగన్వాడీ టీచర్ ఆశా కార్యకర్త మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.