ప్రతిఒక్కరూ మొక్కలు పెంచాలి

గ్రామాల్లో పారిశుధ్యం కోసం తోడ్పడాలి

జగిత్యాల,జూలై13(ఆర్‌ఎన్‌ఎ):గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. పారిశుధ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలతో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వర్షాలు బాగా పడుతున్నందున వచ్చే హరితహారం కార్యక్రమంలో ఇంటింటికి ఆరు నుంచి పది వరకు మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. చెరువులు, గ్రామపంచాయతీ కార్యాలయం, అటవీ, ప్రభుత్వ, ఎస్సారెస్పీ, కమ్యూనిటీ సెంటర్లు, హరితవనాలు, వైకుంఠ దామాల్లో, ఇనిస్టిట్యూషన్‌లలోని ఖాళీ స్థలాల్లో లక్ష్యానికి తగ్గకుండా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ పరిధిలో మూడు కిలో విూటర్ల రోడ్డుకు ఇరువైపులా, మొక్కలు నాటాలనీ, వర్షాలు పడే అవసరాన్ని బట్టి ఇంటింటికి ఆరు నుంచి పది వరకు మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. చెరువులు, గ్రామపంచాయతీ కార్యాలయం, అటవీ, ప్రభుత్వ, ఎస్సారెస్పీ, కమ్యూనిటీ సెంటర్లు, హరితవనాలు, వైకుంఠ దామాల్లో, ఇనిస్టిట్యూషన్‌లలోని ఖాళీ స్థలాల్లో లక్ష్యానికి తగ్గకుండా మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బహిరంగ మల విసర్జన చేసినా, రోడ్లపై చెత్త వేసినా, నీటిని వృథా చేసిన వారికి అపరాధ రుసుము విధించనున్నట్లు పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంబంధిత ప్రత్యేక అధికారులు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. మొక్కలు చనిపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనీ, మొదట ఐదు మండలాలను ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. డ్రెయినేజీలను శుభ్ర పరచాలనీ, ముళ్లపొదలు, రోడ్లకు ఇరువైపులా పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకునేలా చూడాలనీ, ఇండ్లలోని వృథా నీటిని ఇంకుడుగుంతల్లోకి వెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు.