ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మకండి పోడు భూములను సర్వే చేయించుకోండి
అవగాహన కల్పిస్తున్న టిఆర్ఎస్ మండల కమిటీ
టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల పోడు భూముల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో సంబంధిత అధికారులతో ముమ్మరంగా ప్రారంభించారని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 57 సంవత్సరాల నిండిన వృద్ధులకు పింఛన్లు, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు హక్కులు కల్పించడానికి అధికారులతో సర్వేలు చేపడితే ప్రతిపక్షాలు అబద్ధపు ఆరోపణలను నమ్మవద్దని పోడు భూములను సర్వే చేయించుకోవాలని టిఆర్ఎస్ నాయకులు అవగాహన కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం ఉమ్మడి సంపత్ నగర్ గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ మండల కమిటీ విస్తృతంగా పర్యటిస్తూ పోడు గిరిజన రైతులతో గురువారం అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు కంభంపాటి చంద్రశేఖర రావు, మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ మాట్లాడుతూ ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఆదేశానుసారం పోడు భూముల సమస్యను పరిష్కరించే దిశగా రైతులకు అవగాహన కల్పించడానికి సర్వే ప్రక్రియను సద్వితీయోగం చేసుకోవడానికి మండల పర్యటనలో భాగంగా సంపత్ నగర్, గంగారం, చింతోని చిలక గ్రామాల రైతులను కలిసి ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సర్వేను నిజమైన లబ్ధిదారుల అందరూ సర్వే చేసుకోవాలని, ఏ వైనా సమస్యలు ఉంటే త్వరితగతిన సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని మండల నాయకుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సూచించారని వారు తెలిపారు. పింఛన్దారులు కార్డు వచ్చి కూడాఏమైనా సమస్యల�