ప్రతిభతో జాతీయస్థాయి జట్టుకు ఎంపిక కావాలి
రాష్ట్రస్థాయి పోటీలను సందర్శించిన
మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీ, మాజీ చైర్మన్లు, నాయకులు..
రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో “ప్రజా ప్రతినిధులకు” సన్మానం
మిర్యాలగూడ, జనం సాక్షి
క్రీడాకారులు ప్రతిభను కనబరిచి జాతీయస్థాయికి ఎదగాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి అన్నారు.మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ లో గల క్లియో స్పోర్ట్స్ అరేనా లో 8వ యోనెక్స్ సన్‌రైజ్ తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లను మాజీ ఎమ్మెల్యే జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, మిర్యాలగూడ ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చిట్టిబాబు నాయక్ టిఆర్ఎస్ రైతు అనుబంధ జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, మాజీ కౌన్సిలర్ పశ్య శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మథర్ బాబాలు సందర్శించి మ్యాచ్ లను తిలకించారు. అంతకుముందు బ్యాట్మెంటన్ సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్ క్వాటర్ ఫైనల్ మ్యాచ్ లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసింహారెడ్డి మాట్లాడుతూ అండర్ 13 బ్యాట్మెంటన్ పోటీలు మిర్యాలగూడ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ మాట్లాడుతూ బాల, బాలికలకు విద్యతోపాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం అన్నారు. ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి మాట్లాడుతూ అండర్ -13 బ్యాట్మెంటన్ బాల,బాలికల క్రీడాకారుల ఆట తనకు ఎంతగానో ఆకట్టుకుందన్నారు. మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే రైస్ ఇండస్ట్రీస్ కి రెండో స్థానంలో ఉన్న మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్రస్థాయి జూనియర్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ పోటీలు రంగా శ్రీధర్ నిర్వహించి మిర్యాలగూడకు క్రీడలకు వన్నెతెచ్చారన్నారు. క్లియో స్పోర్ట్స్ అరేనా స్టేడియంలో ఆసక్తిగల క్రికెట్ కబడ్డీ, బ్యాట్మెంటన్, తదితర క్రీడాకారులు శిక్షణ పొంది రాబోయే రోజులలో రాష్ట్ర జాతీయస్థాయి జట్టుకు ఆడే విధంగా క్రీడలలోసత్తా చాటాలన్నారు. మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టి బాబు నాయక్ మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభా కనబరిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు దోహదపడుతుందన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు, బ్యాట్మెంటన్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కోశాధికారి రంగా శ్రీధర్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ చాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అండర్ – 13 బాల, బాలికల క్రీడాకారులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఫైనల్ మ్యాచ్ లకు ఎంపికయ్యారన్నారు. ఆయా మ్యాచ్ లలో సత్తాను చాటి జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజులలో సైతం క్రీడలను నిర్వహించేందుకు క్రీడాకారులను, ప్రోత్సహించేందుకు, తన వంతు కృషి చేస్తానని ప్రముఖ రైస్ మిల్లర్ రంగా శ్రీధర్ పేర్కొన్నారు. అతిథులందరికీ రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో బ్యాట్మెంటన్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు, బ్యాట్మెంటన్అసోసియేషన్,కోచ్ రామకృష్ణ, క్లియో స్పోర్ట్స్ అరేనాల స్టేడియం నిర్వాహకులు, ఏచూరి శ్రీ హర్ష, నేతి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.