ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ

 జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్.
తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)తెలంగాణ గడ్డపై భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం మీరు చూపిన తెగువ ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి
చాకలి ఐలమ్మ అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు.జయంతి సందర్భంగా వీరవనితకు  సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణ కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి 2022 సెప్టెంబరు 22న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. భూమినాది.పండించిన పంటనాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ అన్నారు. తెలంగాణ వీరవనిత, ఉద్యమకారిణి అయినా చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిందన్నారు. సామాజిక ఆధునిక పై నామానికి నాంది పలికిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ ప్రతి ఒక్కరికి ఆదర్శవనిత అని అన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్ పర్సన్ దీప, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.