ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
మల్దకల్ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి
మల్దకల్ ఆగస్టు 10 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో ఎమ్మెల్వే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశానుసారం మేకల సోంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం మల్దకల్ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండా పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై గ్రామప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని కులమతాలకతీతంగా పేదధనిక తేడాలేకుండా దేశప్రజలు ఒకే రోజు జరుపుకునే గొప్పపండుగ జాతీయ జెండాపండుగ అని అన్నారు.ప్రభుత్వ కార్యాలయంలకే పరిమితమైన జాతీయ జెండా ఆవిష్కరణ నేడు ప్రతి ఇంటిపై భారతదేశ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం కులమతాలకతీతంగా ఒకేరోజు అమరుల త్యాగాన్ని తలచుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సెక్రటరీ సత్యనారాయణ ,టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి మాజీ కోఆప్షన్ నెంబర్ అహ్మద్, వెంకటన్న , తదితరులు పాల్గొన్నారు.