*ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలి* డి ఎం హెచ్ ఒ రవిశంకర్
పెబ్బేరు ఆగస్టు 10 ( జనంసాక్షి ):
పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను మొక్కలు నాటే జరుపుకున్నారు. కార్యక్రమముతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి శంకర్ మరియు జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సాయి నాథ పాల్గొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవరణ లో మొక్కలు నాటినారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారత దేశం మునకు స్వాతంత్రము వచ్చి 75 సంవత్సరములు కావడము వలన ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య వజ్రోత్సవ జరుపుకోవాలి అన్నారు.
కార్యక్రమము లో వైద్య అధికారి డాక్టర్ సాయి శ్రీ, డాక్టర్ షఫి, పరిమళ, జోసి, మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్, హెల్త్ సూపర్ వైజర్ సత్యమ్మ, వెంకట సుబ్బమ్మ, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, తిరుపతయ్య, వైద్య సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
