ప్రతి ఒక్కరూ ఆటో స్టార్టర్లు తీసివేసి కెపాసిటర్లు బిగించుకోవాలి..
కేసముద్రం అక్టోబర్ 8 జనం సాక్షి / శనివారం రోజున కేసముద్రం మండలంలో బికం సింగ్ విద్యుత్ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ (మహబూబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ ),నరేష్ సూపరిండెంట్ ఇంజనీర్ ఆదేశానుసారం విధ్యుత్ సిబ్బంది గ్రామాలలో ఆటో స్టార్టర్ తీసివేయడం జరిగింది.ఈ విషయంపై ఎస్ ఈ (మహబూబాబాద్ జిల్లా) వారు ఆటో స్టార్టర్స్ వాడడం వలన ట్రాన్స్ఫార్మర్ ఫై ఒకేసారి అధిక లోడు పడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం జరుగుతుంది అందువలన రైతులు స్వచ్ఛందంగా ఆటో స్టాటర్ తీసివేయాలన్నారు. లేనియెడల విద్యుత్ సిబ్బంది ఆటో స్టాటర్స్ తొలిగిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ బోర్ మోటారు వద్ద కెపాసిటర్ ఫిట్ చేసుకోవలెను. కెపాసిటర్ బిగించు కోవడం వలన విద్యుత్ ప్రవాహం ఎచ్చు తగ్గులు లేకుండా సమానంగా వచ్చును రైతుల బోర్ బావి మోటార్లు కాలకుండా ఉంటాయని అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డి ఈ సునీతదేవి మహబూబాబాద్ , ఆర్.శ్రీనివాస్ ఏడీఈ /కేసముద్రం, ఏఈలు/ శశిధర్,రాజు విధ్యుత్ సిబ్బందిని గ్రామాలవారీగా పంపుతూ ఆటో స్టాటర్లు తీసివేస్తూ, బోర్ బావి ,మోటార్లకి కేపాసిటర్స్ బిగిస్తూ వాటిపై అవగాహన వచ్చు విధంగా వివరించడం జరిగింది.