ప్రతి ఒక్కరూ దేశ భక్తిని కలిగి ఉండాలి

  లక్ష గ్రామాల్లో ఆరెస్సెస్ నిర్మాణమే లక్ష్యం
      ఆరెస్సెస్ మెదక్ విభాగ్ సహా కార్యవాహ నర్సింలు
హత్నూర జనం సాక్షి)
భరత గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరూ దేశ భక్తిని కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ మెదక్ విభాగ్ సహా కార్యవాహ బి.నర్సింలు అన్నారు.మండలంలోని దౌల్తాబాద్ అభిజ్ఞ పాఠశాల ఆవరణలో గత వారం రోజులుగా జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంగారెడ్డి జిల్లా ప్రాథమిక శిక్షావర్గ కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన ప్రముఖుల పరిచయ, అభిప్రాయ సమావేశానికి ఆయన ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాథమిక శిక్షావర్గ ముగింపు సమావేశాన్ని నేడు దౌల్తాబాద్ అభిజ్ఞ ప్రైవేటు పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రతి యేటా ఆరెస్సెస్ యువకులతో దేశభక్తి,అనుశాసనం,క్రమశిక్షణ, శారీరక వికాసం,బౌద్ధిక వికాసంపై ప్రాథమిక శిక్షావర్గ నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 55 వేల గ్రామాల్లో ఆరెస్సెస్ సంఘాలు పనిచేస్తుండగా వాటిని లక్ష గ్రామాల్లో విస్తరించేల చేయడమే తమ లక్ష్యమని వారన్నారు. నేడు నిర్వహించు ముగింపు సమావేశానికి హిందూ వారసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.కార్యక్రమంలో సర్పంచి కొన్యాల వెంకటేశం,ఎంపీటీసీ కుంటమీది వీరేశం,కోట గంగరాములు,బోయిని శ్రీనివాస్,ఆమదయ్య,వెంకటేశం గుప్తా,అరిగె యాదగిరి,కూచి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.