ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు

-ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి
*****
సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్22టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి గడపకు అందుతున్నాయని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే కనిపిస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇన్చార్జి వహిస్తున్న మర్రిగూడ మండలం వట్టిపెల్లి, బట్లపల్లి,రాజు నాయక్ తండా గ్రామాల్లో సైదాపూర్ మండల నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఏ గడపకు వెళ్ళిన సంక్షేమ పథకాల లబ్ధిదారులే కనిపిస్తున్నారని తెలిపారు.తామంతా టిఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ ముక్తకంఠంతో ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వృద్ధులను, వికలాంగులను, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, లబ్ధిదారులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ఉప ఎన్నికల్లో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి ఓటు వేసి కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి తదితర సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని వివరించారు. ఈ ప్రచారంలో సర్పంచుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు చందా శ్రీనివాస్, కాయిత రాములు, మాజీ జెడ్పిటిసి బెదరకోట రవీందర్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎలకపల్లి రవీందర్, నాయకులు ఏరుకొండ సుధీర్, రుద్రారపు రవితేజ, కిటకిట రాజు, తదితరులు ఉన్నారు.