ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానం – కోరుట్ల ఎమ్మెల్యే

మల్లాపూర్ ,(జనంసాక్షి) జులై :28 మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కుటుంబ సభ్యుడు తీగల మహిపాల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా.. మహిపాల్ కి టిఆర్ఎస్ పార్టీ లో సాధారణ సభ్యత్వం ఉన్నందున 2 లక్షల ప్రమాద భీమా ఇన్సూరెన్స్ వచ్చింది..దానికి సంబంధించిన చెక్ ను వారి నామిని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు అందించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తని టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యనిలా భవిస్తాదని అన్నారు..పార్టీ కోసం నిరంతరం పని చేసే కార్యకర్తలకు పార్టీ కూడా అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో.. సభ్యత్వం తీసుకున్న ఎవరైనా కార్యకర్త దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించినట్లైతే వారికి ప్రమాద భీమా వర్తించేలా కార్యకర్తలపై పార్టీ ఇన్సూరెన్స్ అవకాశం పార్టీ అధినేత కేసీఆర్ గారు కల్పించారని తెలిపారు.

కార్యకర్త కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండేందుకు ఈ 2లక్షల ప్రమాద భీమా ఇన్సూరెన్స్ అందించడం జరుగుతుందన్నారు.ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ జడ్పిటిసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ