ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించాలి

-జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ బ్యూరో-మార్చ్3 (జనంసాక్షి)

ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో జిల్లాలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 125 ప్రభుత్వ, జెడ్పీ, కేజిబివి, టీఎస్ మోడల్ స్కూల్స్ ఉన్నాయని, ఈ సంవత్సరం 5055 మంది విద్యార్థులు 10 వ తరగతి రాయనున్నరని, 2020, 2021 లో లాక్డౌన్, కరోనా వలన పరీక్షలు లేకపోవడం, 2022 మే లో నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో 8, 9 వ తరగతి పరీక్షలు రాయకుండానే ప్రస్తుతం 10 వ తరగతి ప్రభుత్వ పరీక్షలు రాస్తున్నారని, ఇలాంటి సందర్భంలో విద్యార్థులకు మారిన పాటర్న్ ను తెలిపి ప్రోత్సహించి, తర్ఫీదు నివ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2019 లో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో టి ఎస్ మోడల్ స్కూల్ లో 93 శాతం, కేజిబీవి లో 89, జెడ్పీహెచ్ఎస్ లో 83, మహబూబాబాద్, నేళ్ళికుడురు ప్రభుత్వ పాఠశాలలో 79 శాతం ఇతీర్ణత సాధించామని, కేవలం 7 గురు విద్యార్థులకు మాత్రమే 10 జి.పి. ఏ. రావడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం వంద శాతం మెరుగైన జి. పి. ఏ. తో ఉతేర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు. వెనకబడిన జిల్లా, గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాలో ఫెయిల్ అయిన విద్యార్థులలో ఎక్కువ మంది విద్య అక్కడితో ఆపివెస్తున్నరని, ఆడపిల్లలకు పెళ్లి చేస్తున్నారని, కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి 100 శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా, ఖచ్చితంగా మెరుగైన ఫలితాలతో ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ముందుగా టీచర్ లకు అవగాహన కల్పించామని, వారితో పాటు ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు కు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి పాఠశాలకు జిల్లా అధికారి స్థాయిలో స్పెషల్ అధికారులను నియమించి పాఠశాలకు కావాల్సిన అవసరాలను సర్పంచ్, ఎం.పి.డి.ఓ లకు తెలిపి పనులు చేయిస్తున్నారని తెలిపారు. చదువులో వెనకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు ఎందుకు చదువులో వెనకబడి ఉన్నారో గమనించి వారిలో ధైర్యం కల్పిస్తూ పిల్లలతో స్వయంగా మాట్లాడి చేస్తున్న తప్పులను సరి దిద్దుకునేందుకు సూచనలు చేయాలన్నారు. అవసరమైతే గెస్ట్ లెక్చరర్ తో సబ్జెక్ట్ పై మెళకువలు బోధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలతో ప్రధానోపాధ్యాయులు మాట్లాడి వారిలో ధైర్యం కల్పించి పాఠశాల లోని ప్రతి విద్యార్థి మెరుగైన ఫలితం తో ఉత్తీర్ణత సాధించేందుకు కంకణబద్దులై విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి హైదర్ హై, జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.