ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి..
తాండూరు నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం..
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు జులై 4(జనంసాక్షి)ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గత మూడు రోజులుగా
తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర సమ్మేళనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం తో తాండూరు పట్టణంలో భక్తి వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సాధువులను దర్శించుకున్నారు. అనంతరం వారిని సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సాధువులు ఎమ్మెల్యేను వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ , మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారీ , ఆర్యవైశ్య సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.