ప్రత్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు: సంజయ్‌

జగిత్యాల,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయపథంలో నడిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జగిత్యాల అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌  కోరారు. గ్రామస్తులతో టీఆర్‌ఎస్‌ వెంటే
ఉంటామంటూ ప్రతిచోటా ప్రమాణాలు చేస్తున్నారని అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తీర్మాణం చేస్తున్నారని అన్నారు.  కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతూ అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతవడం ఖాయమన్నారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని అన్నారు. తన ప్రత్యర్థి ఎవరన్నది తనకు ముఖ్యం కాదని సంజయ్‌ అన్నారు.