ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే విధంగా ఉద్యమాన్ని మలుస్తామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 1050వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర సాధనకు ప్రజలందరూ ఐక్యంగా  ఉద్యమిస్తుంటే టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు తమకు పట్టనట్లగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఎవరూ కలిసి వచ్చినా రాకపోయినా ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు భవిష్యత్తులో ఉద్యమ ప్రణాళికను రూపొందించి దానికి అనుగుణంగా పోరాడుతామని వారు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రం స్పందించి వెంటనే ప్రకటన చేయాలని వారు డిమాండ్‌ చేశారు.