ప్రధాని నివాసంలో నీతి ఆయోగ్ సమావేశం
ఢిల్లీ జనంసాక్షి:
ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో 2015 బడ్జెట్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రాల నుంచి వచ్చిన సీఎంలు, ప్రతినిధుల నుంచి ప్రధాని సూచనలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం వివరాలను తెలిపారు. స్వచ్ఛభారత్, జన్ ధన్ యోజన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని జైట్లీ అన్నారు. 66 కేంద్ర పథకాలను కొనసాగించాలని సీఎంలు కోరారని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని ప్రధాని వారికి విజ్ఙప్తి చేశారని తెలిపారు. మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ కమిటీల్లో ఎవరెవరు ఉంటారనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.