ప్రపంచ ఆహార దినోత్సవ అవగాహన సదస్సు
మల్దకల్ అక్టోబర్ 11(జనంసాక్షి)మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మార్వో హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రపంచ ఆహార దినోత్సవ మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎన్ఫోర్స్మెంట్ ఉప తాసిల్దార్లు కేశవులు,మంగమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం 2003 సంవత్సరంలో ప్రాముఖ్యత మండల స్థాయి అవగాహన సమావేశం ఏర్పడింది. గ్రామంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకే రేషన్ కార్డు లో ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తున్నారన్నారు.గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు తహసిల్దార్ హరికృష్ణ ఆదేశించారు.అనంతరం గ్రామంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పోషకాహారం తీసుకోవాలని ఆయన అన్నారు.గర్భిణీ స్త్రీలు,చిన్నపిల్లలు ఆకుకూరలు, పోషకాహారం అందేలా చూడాలని అన్నారు. అనంతరం మూడు సంవత్సరాల పిల్లలకు బాలమృతం 15 రోజుల్లో 16 గుడ్లు అందుతుందని ఆయన తెలిపారు.గ్రామంలో గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలని అంగన్వాడి టీచర్లకు, అయాలకు తహసిల్దార్ హరికృష్ణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకోబ్,డిటి మదన్మోహన్ గౌడ్,ఆర్ఐ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్ ,మధు,డీలర్ల సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి,అంగన్వాడి టీచర్లు సిబ్బంది తదితరు పాల్గొన్నారు.