*ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు*
మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన 100మంది యువకులు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల భీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని అన్నారు. కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ,
నిబద్ధతతో కోదాడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. పార్టీలో చేరిన వారు రేబల్లె గోపి, శ్రీను, వస్తాం అంజయ్య, శేఖర్, మహేష్, నాగరాజు, లింగయ్య, పెద్ద లింగయ్య, చిన్న lలింగయ్య, లింగరాజు, సింహాద్రి, నరసింహ, సైదులు, బాలకృష్ణ, మహేష్, సోమయ్య, సుధాకర్, మదర్, గోపి, శివాజీ, మహేష్, దుర్గాప్రసాద్, హనుమంతు, మల్లేష్, సంజీవ, గోపి, సైదులు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, మునగాల మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, మండల పార్టీ ఉపాధ్యక్షులు సోమపంగు సైదులు, మార్కెట్ కమిటీ వైస్ ఉపేందర్ గౌడ్, ఉప సర్పంచ్ గుండు లింగారావు, గ్రామశాఖ అధ్యక్షులు గోదేశి కోటయ్య, టిఆర్ఎస్ నాయకులు రమణయ్య, అనూష, తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|