ప్రభుత్వం వచ్చాకే బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం ;మున్సిపల్ చైర్ పర్సన్
వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ సెప్టెంబర్ 26 ( జనంసాక్షి )
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వచ్చిందని *కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ గారు* అన్నారు.
సోమవారం పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డులో గల ఎస్ఆర్ఎం పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతకమ్మ పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణలో బతుకమ్మ పండుగకు పూర్వవైభవం వచ్చిందన్నారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.పాఠశాల అంటే కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యతోపాటు విద్యార్థులకు పండుగల విశిష్టతను తెలిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఆర్ఎం పాఠశాల ప్రిన్సిపల్ కేసినేని శ్రీదేవి తో పాటు పాఠశాల ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. పాఠశాల విద్యార్థులు తీరోక్క పూలతో తయారుచేసిన బతుకమ్మలను ఎత్తుకొని బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులతో కలిసి ఆడి పాడారు ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు,గుండపునేని నాగేశ్వరరావు,షేక్ మదార్ సాహెబ్,తిపిరి శెట్టి సుశీల రాజు,మరియు పాఠశాల ఉపాధ్యాయులు రామ్ రెడ్డి, అప్పారావు,శ్రావణి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.