ప్రభుత్వం విద్యకు పెద్దపీట : ఎంపి వివేక్‌

కరీంనగర్‌, జూలై 31 : విద్యార్థుల భవిష్యత్‌ను చక్కదిద్దేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలు జరుపుతున్నదని ఎంపి వివేక్‌ అన్నారు. మంగళవారంనాడు థర్మపురి, బుగ్గారం, మద్దునూరు, గోపాలపూర్‌ తదితర ప్రాంతాల్లో 1.21లక్షల రూపాయలతో పాఠశాలల భవనాలు, వసతి గృహాల నిర్మాణాలు జరుగాయని అన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే ఈశ్వర్‌ శంకుస్థాపనలు నిర్వహించారు. దేశానికి విద్యార్థులే పునాది వంటి వారని, పై చదువులు చదువుకొని, తమ తల్లిదండ్రులకు తోడ్పాటు కల్పించాలని అన్నారు. విశాఖ ట్రస్ట్‌ ద్వారా పాఠశాలలను ఫర్నిచర్‌, ప్రహరీగోడలు నిర్మించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో థర్మపురి నియోజకవర్గంలోని పాఠశాలలు, గ్రామాలలో ప్రజల మౌలిక సదుపాయల కల్పనకు తనవంతు సహాయం అందిస్తానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌లు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించి స్కాలర్‌షిప్‌లు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు, ఎంపిటీసీలు ఎస్‌.భీమయ్య, నాగభూషణం, సత్యమ్మ, కిష్టయ్యతో పాటు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.