ప్రభుత్వ ఉద్యోగులకూ డ్రగ్స్‌ పరీక్షలు

– పంజాజ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం
– డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఛంఢీగర్‌, జులై5(జ‌నం సాక్షి) : పంజాజ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయిం తీసుకుంది. కొన్నేళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్‌ మాఫియాలో పోలీసుల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలతో పంజాబ్‌ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్రంలో వేళ్లూనుకున్న డ్రగ్స్‌ మాఫియాపై పంజాబ్‌ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అధికారం చేపట్టింది మొదలు డ్రగ్స్‌ మహమ్మారిని ఉక్కుపాదంతో అణిచి వేసేందుకు పలు చర్యలుచేపట్టిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సర్కార్‌, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా ప్రభుత్వోద్యోగులకు డోప్‌ టెస్టులు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. అలాగే , కొత్తగా సర్కారీ కొలువుల్లో చేరేవారికి, ప్రమోషన్లు పొందనున్న వారికి కూడా డ్రగ్స్‌ పరీక్షలు జరపనున్నారు. ఈ  పరీక్షల్లో డ్రగ్స్‌ తీసుకున్నట్టుగా తేలితే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి అమరీందర్‌ హెచ్చరించారు.  అలాగే రాష్ట్రంలో నిషేధిత డ్రగ్స్‌ అమ్మేవారికి, స్మగ్లింగ్‌ చేసేవారికి మొట్టమొదటిసారైనా ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందించనున్నట్టు కేంద్ర ¬మ్‌ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు లేఖ రాశారు. రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ భూతాన్ని పూర్తిగా తరివే?సేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ మాఫియాను అంతం చేస్తామన్న హావిూ మేరకు అమరీందర్‌ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంగళవారం అమరీందర్‌ ట్విట్టర్‌ లో ఒక వీడియో సందేశం పెట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యాప్తిని ఏమాత్రం సహించేది లేదని తెలిపారు. డ్రగ్స్‌ వ్యాపారం వెంటనే మానాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. మరణశిక్ష కూడా విధిస్తామని పేర్కొన్నారు.  ప్రతి సోమవారం తాను డ్రగ్స్‌ నిరోధక కమిటీతో సమావేశమై తీసుకుంటున్న చర్యలను సవిూక్షిస్తానన్నారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన డ్రగ్స్‌ మరణాలపై సమగ్ర దర్యాప్తునకు సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆదేశించారు. దోషులుగా తేలితే పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన
అధికారులకు సూచించారు. నెల రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా మాదకద్రవ్యాల కారణంగా దాదాపు 35 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం చెలరేగింది. వీటి నివారణకై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.
———————————–