ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ప్రేమ్ కుమార్
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 19 : ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి బంగారు ప్రేమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రోజురోజుకు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల శాతం తగ్గుతుందని, ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న లెక్చరర్, ప్రిన్సిపల్, తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చేర్యాల మండల బైకని ప్రకాష్, మండల ఉపాధ్యక్షులు సుంచు సంజయ్, వానరాసి నరేందర్, మహేష్, రాజు, చందు, ప్రవీణ్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.