ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి,ప్రధానమంత్రి చిత్రపటాలు ఏర్పాటు చేయాలి
వేములవాడ జులై 26 (జనంసాక్షి)
భారత 15 వ రాష్ట్ర పతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర పతి చిత్రపటం దేశ ప్రధాని చిత్ర పటం ఏర్పాటు చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు భారత రాష్త్ర పతి ద్రౌపది మూర్ము , భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని వేములవాడ పురపాలక సంఘం కమీషనర్ శ్యామ్ సుందర్ రావు కు వేములవాడ పట్టణ బిజెపి శ్రేణులు అందించారు,
ఒక మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ దేశ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ముస్లిం , దళిత , గిరిజన వర్గాలకు రాష్ట్ర పతిగా అవకాశం కల్పించడం డా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పూర్తి రాజ్యాంగ పరిరక్షణలో బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణ బద్ధుడై ఉన్న నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపారు, ఒక బడుగు బలహీన గిరిజన వర్గాలకు చెందిన మహిళా దేశ అత్యున్నత స్థానానికి చేరుకునే మార్గంలో ఈ రాష్త్ర ప్రభుత్వం సహకరించకుండా ఎన్ని కుట్రలు చేసిన ద్రౌపది ముర్ము విజయం పట్ల వేములవాడ ప్రజల పక్షాన వారికి అభినందనలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, జిల్లా అదికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్,నాయకులు అన్నారం శ్రీనివాస్ పిన్నింటి హనుమండ్లు, అన్నారం శ్రీనివాస్, గడ్డమీద శ్రీనివాస్,రామతీర్థం హరీష్,సుమంత్ రెడ్డి, గుడిసె మనోజ్, బిళ్ళ కృష్ణ,రాహుల్,నవీన్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.