ప్రభుత్వ జూనియర్ కళశాల లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి మహిళ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ జులై 19( జనం సాక్షి): పట్టణంలో ని జూనియర్ కళశాల లో విద్యార్థులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని మహిళ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ జ్యోతి పండాల్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆర్య సమాజ్ మందిర ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళశాల ప్రయివేటు కళశాలాలకు దీటుగా ప్రభుత్వం కళశాల లో విద్య ను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కళశాల ప్రిన్సిపాల్ మరియ సిబ్బందికి ఆమె అభినందించారు. కళశాల లో అత్యధిక మార్కుల తో విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారన్నారు. కళశాల లో మాత్రం మౌలికమైన వసతులు లేక విద్యార్థులు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. కళశాల కు ముఖ్యంగా ప్రహరీ గోడ లేకపోవడంతో పోకిరీలు విద్యార్థుల కు వేధింపులు గురిచేస్తున్నారన్నారు. సరియైన గదులు లేవు మంచి నీటి సమస్య మరుగుదొడ్లు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అని అన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేనిచో విద్యార్థులను ఐక్యం చేసి ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.