ప్రభుత్వ జూనియర్ కళాశాలలోబతుకమ్మ సంబరాలు,ఫ్రెషర్స్ డే

మల్దకల్ అక్టోబర్1(జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారము బతుకమ్మ సంబరాలు, ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీపీ వై రాజారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి ,సర్పంచ్ యాకోబు, పాల్గొన్నారు.ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాలలో వారు విద్యార్థులతో కోలాటాలతో ఆడి పాడుతూ ఆనందించారు. రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో కూడా హాజరై విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేశారు.ఎంపీపీ రాజారెడ్డి మాట్లాడుతూ ఉన్నత స్థానంలోకి ఎదిగిన ప్రతి ఒక్కరూ చాలా కష్టాలు అనుభవించి వాటి నుండి ఫలితాలు పొంది ఆ స్థాయికి ఎదిగి ఉంటారని కావున ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత తమ ప్రాంతానికి ఏదో రకంగా సాయం చేయాలని సూచించారు.కళాశాలలో అత్యధిక మార్పులు సాధించిన 14 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున నగదు బహుమతి ఇచ్చారు.తిమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య ఉచిత పాఠ్యపుస్తకాలు మంచి అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంను వినియోగించుకొని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ సందర్భంగా తిమ్మా రెడ్డికళాశాలలో ప్రొజెక్టర్ కోసం 20వేల నగదు సాయం చేస్తానని సూచించారు.స్థానిక సర్పంచ్ యాకోబు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల కోసం వాటర్ ట్యాంకు తన సర్పంచ్ నిధుల నుండి నిర్మిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్ లింగం,నాయకులు పెద్దొడ్డిరాముడు, కళాశాల అధ్యాపకులు నరసింహులు, రామాంజనేయులు గౌడ్, శివకుమార్,గోవర్ధన్ శెట్టి, భాగ్యలక్ష్మి,తిమోతి ,శ్రీనాథ్, రమేష్,ఆంజనేయులు,పర్వీన్ సుల్తానా,సూరిబాబు, హనుమంతు,శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.