ప్రభుత్వ పాఠశాలలోనే వసతులు ఫుల్

శివ్వంపేట సెప్టెంబర్ 20 జనంసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన వసతులు ఫుల్ గా  కల్పిస్తున్నామని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. శివ్వంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఉచితంగా సరఫరా చేస్తున్న యూనిఫామ్స్ ను పాఠశాల ప్రిన్సిపల్ మంజులతో కలిసి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించడం జరుగుతుందని,కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యా బోధనను అందిస్తున్నామని ఆయన అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలే మారిపోతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో  కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాద్యాయులు రాధిక, జ్వాల, స్వరూప రాణి, జ్యోతీ, మెరోనిక, రాణి, సంతోషిణి, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area