ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసమే
మన ఊరు మన బడి
ఎంపీడీఓ శంకర్ నాయక్
మహాదేవపూర్ జులై 26 ( జనంసాక్షి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో ఎం పి డి ఓ శంకర్ నాయక్ . సర్పంచ్ శ్రీపతిబాపు ఆధ్వర్యంలో మహాదేవపూర్ పాఠశాలలను పర్యవేక్షణలో చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు మన బడి పథకంలో భాగంగా చేపడుతున్న వివిధ పనులను,డైనింగ్ హాల్ పిల్లర్ల నిర్మాణ పనులను ఎంపీడీఓ శంకర్ నాయక్ పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ-మౌలిక వసతుల కల్పన కు ఉద్దేశించిన పథకం నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రానుందని,సర్కార్ నిర్ణయంతో ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందని ఎంపీడీఓ శంకర్ నాయక్ అన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీపతి బాపు. కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
