ప్రభుత్వ పాఠశాల ల సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ కు వినతి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి
వనపర్తి జులై 2(జనం సాక్షి) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ కు శనివారం వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడిచిన ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు రాలేదన్నారు.పాఠ్యపుస్తకాలు రాకుండా పేద విద్యార్థులు తమ చదువులు ఎలా కొనసాగించగలరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని,ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫార్మ్స్ ఇవ్వాలని,ప్రతి పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించి,మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించి, పెండింగ్ వంట షెడ్లు,భోజన బిల్లులను విడుదల చేయాలని, మండలంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసి మన ఊరు-మనబడి లో అన్ని పాఠశాలలను చేర్చి అభివృద్ధి చేయాలని,కంప్యూటర్ విద్యను అభివృద్ధి చేయాలని వారు పేర్కొన్నారు. అలాగే ఆట వస్తువులు కొనుగోలు చేసి ఖాళీగా ఉన్న పీఈటి,పిడి పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఈఓ కు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు యుగేందర్,శ్రీను నాయక్ పాల్గొన్నారు.