ప్రభుత్వ భూమిని కబ్జా కోరుల నుండి కాపాడండి

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను ఆపాలని ఫిర్యాదు చేసిన– కాట సుధా శ్రీనివాస్ గౌడ్.
సంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 22:(జనం సాక్షి):
అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలోని సర్వే నంబర్ 12లో గల ప్రభుత్వ భూమిపై జరుగుతున్న కబ్జాల పై బీరంగూడ మండల కేంద్రంలో తహశీల్దార్ గారికి మరియు పటేల్ గూడ పంచాయతీ కార్యదర్శి గారికి వినతి పత్రం అందజేసి ప్రభుత్వ భూములను కబ్జా కోరుల నుండి కాపాడాలని అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరిన *సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాట సుధాశ్రీనివాస్ గౌడ్* గారు. ఈ కార్యక్రమంలో మండల్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ మున్నా, నాయకులు శశిధర్ రెడ్డి, సుధాకర్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు..
Attachments area