ప్రభుత్వ విద్యారంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి
టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి, అక్టోబర్ 15( జనం సాక్షి): ప్రభుత్వ విద్యా రంగం అనేక సమస్యలతో సతమతమవుతున్నందున ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విద్యారంగంపై సమీక్ష నిర్వహించి వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించి బలోపేతానికి కృషిచేసి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి కృషి చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా పదోన్నతులు,ఐదు సంవత్సరాలుగా బదిలీలు,నియామకాలు లేక అనేక పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు నష్టం జరుగుతున్నదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన నిర్వహణ నిధులు ఇవ్వకపోవడంతో పాఠశాల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు భారంగా మారిందని,పాఠ్యపుస్తకాలు సకాలంలో అందకపోవడం,స్కూల్ యూనిఫామ్ సకాలంలో అందించలేకపోవడం,యూనిఫామ్స్ కుట్టుకూలీ సరిపోకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,స్టీట్చింగ్ ఛార్జ్ పెంచాలని అన్నారు. ప్రభుత్వం అన్ని యాజమాన్యాలలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు ఎనిమిది సంవత్సరాలుగా కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు సంతోషంగా విధులు నిర్వహించలేకపోతున్నారని,ఉన్న కేడర్ లోనే పదవీ విరమణ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. జీవో 317 బదిలీలలో నష్టపోయిన,అన్యాయానికి గురైన ఉపాధ్యాయులకు,13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని,కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని,గిరిజన సంక్షేమ శాఖలోని కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని, గిరిజన సంక్షేమ శాఖలోని ఉ�