*.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికె రచ్చబండ*

హామీల అమలులో ప్రభుత్వం విఫలం*
*.పేదలకు ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ దే*
*.టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి*
జనం సాక్షి వెల్దుర్తి:
రాష్ట్ర  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కాంగ్రెస్ రచ్చ బండ నిర్వహిస్తోందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం వెల్దుర్తి మండల పరిధిలోని మన్నెవరు జలాలుపూర్, మనేపల్లి, ధర్మారం గ్రామలల్లో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలలో దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమి చేశారని, లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలతో మోసపోతున్న తెలంగాణ రైతులకు ఒక భరోసా నిస్తూ రైతు సంఘర్షణ వేదికగా రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రైతు డిక్లరేషన్ పెట్టడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఎకరానికి 15000 పెట్టుబడి సాయం, అందిస్తామని, భూమి లేని నిరుపేదలకు భూమి ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి 12 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని, పంటలకు గిట్టుబాటు ధరలు నిర్వహిస్తామని, పోడు అసైన్డ్ భూముల రైతులకు పట్టాలు ఇప్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని నర్సాపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని రాజిరెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రనాయకులు రవీందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,
వెల్దుర్తి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్,కో ఆప్షన్ మెంబర్ యదులు,ఎంపీటీసీ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area