ప్రమాదకరంగా మారిన రోడ్డు

పట్టించుకునే నాథుడే కరువయ్యాడు
ప్రమాదం జరిగితే గానీ స్పందించరా
మల్హర్, జనంసాక్షి
మండలంలోని కొయ్యూరు సబ్ స్టేషన్ ఎదుట మంథిని – కాటారం ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదకరంగా తయారైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు మొత్తం గుంతలుగా ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారాయని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ గుంతల్లో వర్షపు నీరు నిండి గుంతలు ఏర్పడకుండా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందని రాత్రిల్లో ఏ మాత్రం ఆద మరిచిన ద్విచక్ర వాహనాల పై ప్రయాణం చేసి ప్రయాణికులు పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పలువురు భయందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ ఎదుట ఏర్పడిన బారీ గుంతలను పూడ్చే నాథుడే కరువయ్యారని సంభందిత అధికారులు ప్రమాదం జరిగితే గానీ పట్టించుకోరా అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పై గుంతలు పూడ్చి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని  పలువురు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.