ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు
విద్యార్థులు సురక్షితం
విజయవాడ, జూలై 20 : జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వద్ద శుక్రవారం నాడు ఒక స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. కాగా విద్యార్థులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. జగ్గయ్యపేటకు చెందిన ఒక విద్యాసంస్థ విద్యార్థులను వాహనంలో తీసుకువస్తున్న తరుణంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. కాగా విద్యార్థులకు ఎలాంటి అపాయం కలగలేదు. బస్సు కొద్దిగా ముందుకు వెళ్లివుంటే కాల్వలో పడిపోయి ఉండేది. ఒక రకంగా పెద్ద ప్రమాదమే తప్పిపోయింది.