ప్రమాద హెచ్చరిక సూచికను ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్

రోడ్డు నిర్మాణం పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. పానుగంటి విష్ణువర్ధన్
 కేసముద్రం అక్టోబర్ 11 జనం సాక్షి / కేసముద్రం నుండి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో గాంధీనగర్ వద్ద ప్రమాదకర స్థాయిలో ఆర్ అండ్ బి రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతిన్నదని రోడ్డు దెబ్బతిని రెండు నెలలు కావస్తున్న సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడంలేదని వాపోయారు. కేసముద్రం మండల కేంద్రంలో పత్రిక ప్రకటన విడుదల చేసి ఆయన మాట్లాడుతూ… రోడ్డు మార్గంలో ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారులు భారీ వాహనాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన అన్నారు ఇదే క్రమంలో రాత్రి సమయంలో ప్రయాణం చేసే వాహనదారులకు రోడ్డు మీద ఏర్పడిన గుంత వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.ప్రజల సౌకర్యార్థం మేరకై కేసముద్రం నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల కమిటీ తరఫున ప్రమాదం హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేశామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసముద్రం మండల అధ్యక్షుడు కొనకటి మహేందర్ రెడ్డి,పోతుల రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area