ప్రయివేటు ఉపాధ్యాయుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం

రుద్రంగి జూలై 29 (జనం సాక్షి)
సామజిక సేవకులు సాదుల్ల  ఆధ్వర్యంలో 21000 ల విరాళాలు సేకరణ.సోషల్ మీడియా వేదికగా మల్యాల గ్రామనికి చెందిన మధు సార్ బ్రెయిన్ ట్యుమర్ ఆపరేషన్ కోసం మన చేయూత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంపేయినింగ్ లొ భాగంగా కథలాపూర్ అంజూమ్ ట్రేడర్స్ ఓనర్ సాదుల్ల బాధ్యత తీసుకొని కొంతమంది స్నేహితుల సహకారంతో 21000 రూపాయలు సమకుర్చడం జరిగింది.అట్టి విరాళాన్ని ఈరోజు మధు స్నేహితులు మల్యాల వాకర్స్ యూత్ సభ్యుడు గుర్రం భాలేశం,అరిపెల్లి రవి లకు అందించడం జరిగింది. అలాగే మధు వైద్య ఖర్చులకు రుద్రంగి గ్రామానికి చెందిన చైతన్య భారతి హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఎలిగేటి మహేష్ ఆధ్వర్యంలో 2004,5 సంవత్సర విద్యార్థులు తమ వంతుగా సార్ కు 6000 ఇవ్వడం జరిగింది.ఇట్టి సహాయం అందించిన దాతలకు మన చేయూత సేవా సమితి సభ్యులు దన్యవధాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లింగంపల్లి గంగాధర్
,కత్తి రాజు తదితరులు పాల్గొన్నారు.