ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
ఏలూరు, జూలై 22 : జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ వాణీమోహన్ తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 17,300 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 14,520 మంది ఎపిపిఎస్‌సి వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడు చేసుకున్నారు. వీరిలో ఆదివారం ఉదయం జరిగిన పరీక్షకు 10,565 (72.6 శాతం), మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 10,518 (72.43 శాతం) హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.